తెలంగాణ

telangana

ETV Bharat / videos

నిప్పులపై నడుస్తూ పడిపోయిన పూజారి.. మంటలు చెలరేగి...

By

Published : May 11, 2022, 10:08 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

Fire walking ceremony: కర్ణాటక రామనగర జిల్లా హరూర్​ గ్రామంలో నిర్వహించిన ఉత్సవాల్లో అపశ్రుతి దొర్లింది. నిప్పులపై నడిచే కార్యక్రమంలో ఓ పూజారి తీవ్రంగా గాయపడ్డారు. నదీశ్​ అనే పూజారి.. దైవాన్ని తలుచుకుంటూ ఊగిపోయారు. నిప్పులపై నుంచి పరుగెడుతూ పడిపోయారు. దీంతో దుస్తులకు మంటలు అంటుకున్నాయి. వెంటనే లేచి బయటకు పరిగెట్టిన పూజారిని చెన్నపట్టణ్​ తాలూకా ఆసుపత్రికి తరలించారు. భగభగ మండే నిప్పులపై పడటం వల్ల శరీరానికి తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. మంగళవారం జరిగిందీ ఘటన.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details