రైలు బోగీలో పొగ.. చాకచక్యంగా వ్యవహరించిన లోకో పైలెట్.. తప్పిన ప్రమాదం - రైలులో వ్యాపించిన పొగ
దిల్లీ నుంచి బిహార్‌లోని దర్భంగాకు వస్తున్న బిహార్ సంపర్క్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగ వ్యాపించింది. పొగను గమనించి అప్రమత్తమైన లోకో పైలెట్ వెంటనే రైలును ఆపేశాడు. ఈ ఘటన థల్వారా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది.
ఇదీ జరిగింది..దిల్లీ నుంచి దర్భంగా బయలుదేరిన బిహార్ సంపర్క్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. థల్వారా రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే.. రైలులోని ఎస్2 బోగీలో ఒక్కసారిగా పొగ వ్యాపించింది. ఈ విషయం గమనించిన లోకో పైలెట్ .. వెంటనే అప్రమత్తమై రైలును ఆపేశాడు. పొగ వ్యాపించడం వల్ల ఆందోళనకు గురైన ప్రయాణికులు రైలు దిగి.. పట్టాలకు దూరంగా వచ్చారు. దాదాపు 15 నిమిషాలు రైలు నిలిచిపోయింది. రైల్వే సిబ్బంది తనిఖీ నిర్వహించి.. పొగను అదుపులోకి తెచ్చారు. అనంతరం రైలు దర్భంగాకు బయలుదేరింది. ఈ ఘటనపై సమస్తీపుర్ రైల్వే డివిజన్ డీఆర్‌ఎమ్ అలోక్ అగర్వాల్ స్పందించారు. బ్రేక్ వైండింగ్ కాలిపోవడం వల్ల రైలు బోగీలో పొగలు వ్యాపించాయని తెలిపారు. బ్రేక్ షూ.. రైలు చక్రం మధ్య రాపిడి ఎక్కువ కావడం వల్ల ఇలా జరుగవచ్చని ఆయన వెల్లడించారు.
TAGGED:
Superfast Train in Darbhanga