తెలంగాణ

telangana

Fire Accident in Adithya Pharma Sangareddy

ETV Bharat / videos

పాశమైలారంలోని ఆదిత్య ఫార్మాలో అగ్నిప్రమాదం - Fire accident in Pashamylaram industrial area

By ETV Bharat Telangana Team

Published : Nov 12, 2023, 3:39 PM IST

Updated : Nov 12, 2023, 5:23 PM IST

Fire Accident in Pharama Company Pashamylaram :సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో ఆదిత్య ఫార్మా పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడగా.. మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు

Fire Accident in Adithya Pharma Sangareddy :పాశమైలారం పారిశ్రామికవాడలోని ఆదిత్య ఫార్మాపరిశ్రమలో పౌడర్ తెచ్చి.. రసాయనాలు తయారుచేసి మిళితం చేస్తుంటారు. ఎప్పటిలాగే రసాయనాలు మిళితం చేస్తున్న సమయంలో.. అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో బిహార్​కు చెందిన హన్సీలాల్, మహేష్, రాజ్​సింగ్, రాజీ అనే నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పారిశ్రామికవాడలో అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు అగ్నిమాపక శకటాలు, అలాగే పటాన్​చెరు అగ్నిమాపక కేంద్రం నుంచి మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. గాయపడ్డ వారిని కాకతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చాలా సేపటికి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పరిశ్రమకు ఎటువంటి అగ్నిప్రమాద నివారణ ఎక్విప్మెంట్ లేదని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ తెలిపారు. బీడీఎల్ బానూరు పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ పరిశ్రమకు రసాయనాలు మిళితం చేసేందుకు అనుమతి ఉందా అని.. స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Nov 12, 2023, 5:23 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details