వ్యాన్‌పై విద్యుత్ తీగ పడి చెలరేగిన మంటలు - అగ్నిమాపక సిబ్బంది చొరవతో తప్పిన పెనుప్రమాదం - డీసీఎంలో విద్యుత్ తీగ పడి చెలరేగిన మంటలు
Published : Dec 2, 2023, 9:08 PM IST
Fire Accident in DCM Van at Vemulawada : గడ్డి కట్టలు తరలిస్తున్న డీసీఎం వ్యాన్‌పై విద్యుత్ తీగ తెగి పడటంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో జరిగింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. సిబ్బంది వెంటనే మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ ప్రమాదాలు ఇటీవల కాలంలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి.
Fire Accident at School in Siddipet : మరో ఘటనలో సిద్దిపేటలోని కాకతీయ టెక్నో హై స్కూల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో ఏసీ వద్ద ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన విద్యార్థులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. దీంతో విద్యార్థులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. స్కూల్ యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థలానికి చేరుకున్న సిబ్బంది ఫైర్ ఇంజిన్‌లతో మంటలను అదుపు చేశారు.