Fire Accident at LB Nagar : ఎల్బీనగర్లో భారీ అగ్ని ప్రమాదం.. కార్ల షోరూమ్‌లో ఎగసిపడుతున్న మంటలు - హైదరాబాద్ వార్తలు
Fire Accident at LB Nagar : హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని 'కారోమెన్' అనే కార్ గ్యారేజీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అక్కడ భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద తీవ్రతకు షోరూమ్‌లోని టైర్లు అంటుకొని దట్టంగా పొగలు వ్యాపించాయి. రిపేర్ కోసం వచ్చిన 10 నుంచి 20 కార్లు మంటల్లో దగ్ధమైనట్లు సమాచారం. గ్యారేజీలో కార్ల టైర్లు ఉండటంతో ప్రమాదం తీవ్రత మరింత పెరిగింది. ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పుతుండగా గ్యారేజ్‌లో ఉన్న సిలిండర్ పేలింది. సిలిండర్ పేలి పెద్దపెద్ద శబ్దాలు రావడంతో చుట్టుపక్కల ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. దట్టంగా పొగ వ్యాపించడంతో పరిసర ప్రాంతవాసులు ఆందళన చెందుతున్నారు. సిలిండర్ పేలడంతో ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని అక్కడి నివాసితులు బయపడుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్లతో మంటలు ఆదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సిలిండర్ పేలిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది కూడా జంకుతున్నారు.