తెలంగాణ

telangana

Fire Accident at Petrol Bunk

ETV Bharat / videos

టిప్పర్​ ఇంజిన్​లో మంటలు - పెట్రోల్​బంకులో తప్పిన పెను ప్రమాదం - ​పెట్రోల్​బంకులో అగ్ని

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2024, 7:42 PM IST

Fire Accident at Petrol Bunk : పెట్రోల్​ బంకులో ఇంధనం నింపుకోవడానికి వచ్చిన లారీ ఇంజిన్​లో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన కరీంనగర్​ జిల్లాలో చోటుచేసుకుంది. పెట్రోల్​ బంకు సిబ్బంది అప్రమత్తమై హుటాహుటిన మంటలు ఆర్పేశారు. తృటిలో పెను ప్రమాదం తప్పినందుకు బంకు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Lorry Fires at Bunk in Karimnagar : వివరాల్లోకెళ్తే కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం ఒద్యారంలోని పెట్రోల్​ బంకుకి డీజిల్​ ఫిల్​ చేసుకోవడానికి టిప్పర్ వచ్చింది. డీజిల్​ నింపడానికి సిద్ధమవుతున్న సమయంలో ఇంతలోనే టిప్పర్​ ఇంజిన్​ నుంచి పొగలు రావడం ప్రారంభమై మంటలు చెలరేగాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు టిప్పర్​ ఇంజిన్​కు పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన పెట్రోల్​ బంకు సిబ్బంది మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు. బంకులో ఉన్న ఫైర్​ డిష్టింగ్యుషర్​, పెద్దఎత్తున నీటిని చల్లి మంటలను ఆర్పివేశారు. తృటిలో పెను ప్రమాదం తప్పిందని బంకు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మంటలు చల్లార్చడంతో ఏమాత్రం ఆశ్రద్ధ వహించిన భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణనష్టం సంభవించేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details