తెలంగాణ

telangana

Fire Accident

ETV Bharat / videos

Hyderabad Fire Accident : మరోసారి భగ్గుమంది.. అగ్నిప్రమాదాలు ఆగేదెన్నడు..? - Hyderabad Fire Accident Today

By

Published : Apr 20, 2023, 10:48 AM IST

Hyderabad Fire Accident Today : భాగ్యనగరంలో వరుస అగ్నిప్రమాదాలు ప్రజలను భయదోళనకు గురి చేస్తున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. ఈ నెలలో హైదరాబాద్​లో అగ్నిమాపక వారోత్సవాలు భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయినా తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. 

తాజాగా మరోసారి హైదరాబాద్ నగరంలో అగ్నిప్రమాదం జరిగింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లక్డీకపూల్​లోని పాత రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు, వాహనదారులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వేసవిలో అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారులు సూచిస్తున్నారు. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details