తెలంగాణ

telangana

Suman

ETV Bharat / videos

Actor Suman support BRS : 'రాబోయే ఎన్నికల్లో గెలిచేది బీఆర్​ఎస్.. ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆరే' - Film actor Suman

By

Published : Jun 24, 2023, 6:19 PM IST

Actor Suman support KCR : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కానీ.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ క్రమంగా పుంజుకుంటోందన్నారు. రాజకీయాల్లో ఏవరినీ తక్కువ అంచనా వేయకూడదని అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ఆయుర్వేద ఆసుపత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని.. ఆయుర్వేద ఉత్పత్తులను సుమన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నటుడు సుమన్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమీషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు, డాక్టర్‌ మూర్తి, డాక్టర్‌ ప్రేమ్‌, డాక్టర్‌ యామిని తదితరులు పాల్గొన్నారు. 

తాను ఏ పార్టీ నుంచి పోటీ చేయడం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు. కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం కోసం ముందుండి పోరాటం చేశారన్నారు. గత 30 ఏళ్లుగా తెలంగాణ పరిస్థితులను, తెలంగాణ ప్రజలను స్వయంగా చూశానని.. వారు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకోవడంతో పాటు.. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి ఆదరణ పెరుగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్నీ రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్న ఆయన.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలంగాణ అభివృద్ధి గురించి చర్చ జరుగుతోందన్నారు. 

ABOUT THE AUTHOR

...view details