Film Actor Ravi Babu Reacts on Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై సినీ నటుడు రవిబాబు స్పందన.. ఆయన డబ్బు మనిషి కాదంటూ..! - ఏపీలో నిరసనలు
Published : Sep 30, 2023, 9:46 AM IST
Film Actor Ravi Babu Reacts on Chandrababu Arrest:చంద్రబాబు అక్రమ అరెస్టుపై రాష్ట్రలోనే కాకుండా ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా తమ నిరసనను తెలుపుతున్నారు. తాజాగా సినీ నటుడు, దర్శకుడు రవిబాబు స్పందించారు. చంద్రబాబు అరెస్టుపై ఆయన ఓ వీడియో విడుదల చేశారు. చంద్రబాబు అరెస్టును తప్పుపట్టారు. రవిబాబు మాట్లాడుతూ.. జీవితంలో రాజకీయ నాయకుల పవర్ కానీ, సినిమా వాళ్ల అందం కానీ ఏదీ శాశ్వతం కాదని, అలానే చంద్రబాబుకు వచ్చిన కష్టాలు కూడా శాశ్వతం కాదని అన్నారు. చంద్రబాబు గురించి చెప్పాలి అంటే ఆయన ఏదైనా ఒక పని చేసేటప్పడు అనేక విధాలుగా ఆలోచించి ఎంతో మందిని సంప్రదించి ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకుంటాడు. భూమి మీద ఈరోజే ఆఖరి రోజు అని తెలిసినా వచ్చే 50 సంవత్సరాలకు అభివృద్ధి గురించి ప్లాన్స్ వేస్తారు. ఆయన డబ్బు కోసం ఆలోచించే మనిషి కాదు.. కాని అలాంటి వ్యక్తిని సరైన ఆధారాలు లేకుండా 73 ఏళ్ల వయసులో జైలులో పెట్టి ఎందుకు వేధిస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు.