Fighting Video in Hyderabad : సినీఫక్కీలో.. 10 మంది హాకీ స్టిక్స్‌తో యువకుడిపై దాడి - telangana crime news
Young man Fighting video in Hyderabad : కొంత మంది యువకులు బృందంగా ఏర్పడి.. ఓ యువకుడిపై దాడి చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 17వ తేదీన 10 నుంచి 15 మంది గుర్తు తెలియని వ్యక్తులు హుమాయున్ నగర్‌లోని పారమౌంట్ కాలనీ గేట్ నెంబర్ 2 వద్ద పైసల్ అనే యువకుడిపై తల్వార్లు, హాకీ స్టిక్స్‌లతో దాడి చేశారు. దీంతో బాధితుడు పెద్దగా అరిచాడు. ఈ శబ్దాలు విన్న కాలనీ వాసులు పోలీసులకు ఫోన్ చేశారు.
ఈ దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. దాడి చేసిన వారిపై హుమాయున్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని పట్టుకునేందుకు అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడిపై దాడి చేసేందుకు కారణం ఏమిటి? దాడి చేసిన వారు ఎవరు? అన్న కోణాల్లో విచారణ చేపట్టారు. స్థానికులు రికార్డ్ చేసిన వీడియోను స్వాధీనం చేసుకున్న పోలుసులు దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.