తెలంగాణ

telangana

Fiber_Case_in_ACB_Court

ETV Bharat / videos

ఫైబర్‌నెట్‌ కేసులో టెరాసాఫ్ట్‌ ఆస్తుల అటాచ్‌కు ఏసీబీ కోర్టు అనుమతి

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 5:35 PM IST

Fiber Case in ACB Court: ఫైబర్‌నెట్‌ కేసులో టెరాసాఫ్ట్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఏసీబీ కోర్టు అనుమతించింది. మొత్తం 114 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. టెరాసాఫ్ట్‌ కంపెనీ ఆస్తుల అటాచ్‌మెంట్‌ కోసం ఏపీ సీఐడీ అధికారులు గతంలో ఏసీబీ కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆస్టులు అటాచ్‌ చేస్తూ.. తీర్పు వెలువరించింది.

CID Filed Petition in ACB Court in Fiber Net Case:ఫైబర్ నెట్ కేసులో (Fiber net case) నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ అనే కంపెనీకి అక్రమంగా అనుమతులిచ్చారంటూ సీఐడి (CID) అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో టెరాసాఫ్ట్ కంపెనీతో పాటు.. టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు (Case registered against TDP leader Chandrababu) చేశారు. ఈ కేసులో టెరాసాఫ్ట్ కంపెనీకి (Terasoft Company) సంబంధించిన ఆస్తులను అటాచ్​మెంట్ చేసేందుకు అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో (Vijayawada ACB Court) పిటిషన్ దాఖలు చేశారు. ఏడు ఆస్తులను అటాచ్​మెంట్ చేస్తున్నట్లు సీఐడి అధికారులు పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం అనుమతించింది. ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఐడీకి అనుమతి ఇచ్చింది. 

ABOUT THE AUTHOR

...view details