తెలంగాణ

telangana

35 తర్వా త వంశంలో పుట్టిన ఆడపిల్ల.. ఏనుగుపై ఊరేగించిన తండ్రి

ETV Bharat / videos

35ఏళ్ల తర్వాత ఆడపిల్ల జననం.. ఏనుగుపై ఊరేగించిన తండ్రి - ఆడపిల్లను ఏనుగుపై ఊరేగించిన తండ్రి

By

Published : May 27, 2023, 9:59 PM IST

ఆ వంశంలో 35 ఏళ్ల తర్వాత ఆడపిల్ల జన్మించింది. దీంతో ఆనందం తట్టుకోలేని తండ్రి.. కూతురుని ఏనుగు మీద ఊరేగించాడు. మొదటి సారిగా ఇంటికి వస్తున్న చిన్నారికి ఘన స్వాగతం పలికాడు. మహారాష్ట్రకు చెందిన గిరీశ్ పాటిల్​ అనే వ్యక్తి.. తనకు కూతురు పుట్టినందుకు ఈ తరహాలో ఆనందాన్ని పంచుకున్నాడు.

ఇదీ జరిగింది
కొల్హాపూర్‌లోని పచ్‌గావ్​లో నివాసం ఉండే గిరీశ్ పాటిల్​కు.. ఐదు నెలల క్రితం కూతురు పుట్టింది. ముద్దుగా ఆమెకు 'ఐరా' అని పేరు కూడా పెట్టుకున్నాడు. కాగా శనివారం తొలిసారిగా తన కూతురిని ఇంటికి తీసుకువచ్చాడు. ఎప్పటికి గుర్తుండి పోయేలా చిన్నారికి ఘన స్వాగతం పలికాడు. కూతురిని ఏనుగుపై ఊరేగిస్తూ ఇంటికి తీసుకెళ్లాడు. వేషధారణలు, డప్పుల మధ్య చిన్నారికి ఆహ్వానం పలికాడు. 35 ఏళ్ల తరువాత తమ ఇంట్లో కూతురు పుట్టడంపై పాటిల్​ కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని తాము మహాలక్ష్మిగా భావిస్తున్నట్లు తెలిపారు. స్థానికుల నుంచి కూడా గిరీశ్ పాటిల్​కు అభినందనలు అందుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details