వరి ధాన్యం డబ్బుల కోసం చెప్పులను క్యూ లైన్లో పెట్టిన రైతులు - Farmers in front of Central Bank in Yeldurthy
Published : Dec 5, 2023, 7:01 PM IST
Farmers Standing In Front Of The Bank For Money In Medak : వరి ధాన్యం డబ్బులకోసం గంటల తరబడి నిలబడలేక రైతులు చెప్పులను క్యూ లైన్లో పెట్టిన ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తిలో చోటు చేసుకుంది. సెంట్రల్ బ్యాంక్ ముందు రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం ధాన్యం డబ్బుల కోసం ఉదయం 8 గంటలకే బ్యాంక్ ముందు లైన్లో నిల్చున్నామని వారు తెలిపారు. గత రెండు మూడు రోజులుగా ఆన్ లైన్ పనిచేయడం లేదని బ్యాంక్ అధికారులు చెబుతున్నారని రైతులు వాపోయారు.
Queue line with slippers in front of bank in Medak : మిషన్ కోసిన వారు, దున్నినవారికి డబ్బులు ఇద్దామంటే బ్యాంక్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని రైతులు పేర్కొన్నారు. మొన్నటి వరకు ఎన్నికలు కోడ్ అమలులో ఉండటంతో తాము ధాన్యం డబ్బులు డ్రా చేసుకోలేకపోయమని ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత కూడా, డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.