తెలంగాణ

telangana

Audience

ETV Bharat / videos

Fans fight for Virupaksha Movie: విరూపాక్ష సినిమా టైంకి స్టార్ట్ చేయలేదని థియేటర్​లో ఫ్యాన్స్ రచ్చ

By

Published : Apr 24, 2023, 11:52 AM IST

Fans attack on theater for Virupaksha Movie in Hyderabad: టికెట్ కొని సినిమా వెళ్లిన ప్రేక్షకులకు సరైమ సమయానికి షో వేయకపోవడంతో ఆగ్రహనికి గురైన ప్రేక్షకులు అద్దాలు పగలగొట్టి ఫర్నిచర్​ అంత ధ్వంసం చేసిన  ఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి చోటుచేసుకుంది. హైదరాబాద్​లోని మూసాయిపేటలో లక్ష్మీకళ థియేటర్​లో  హీరో సాయిధరమ్ తేజ్‌ నటించిన విరూపాక్ష సినిమా  ప్రదర్శిస్తున్నారు. టికెట్​ తీసుకొని ప్రేక్షకులు సినిమా హాల్​లో కూర్చున్నారు. సాయంత్రం 6 గంటలకు షో ప్రారంభం కావాల్సింది ఉండగా  ఏడున్నర గంటలు అవుతున్నా తెరపై సినిమా ప్రదర్శించలేదు. దీంతో గంటన్నర సేపు ఆగిన  ప్రేక్షకులు ఒక్క సారిగ ఆగ్రహానికి గురయ్యారు. కోపంలో థియేటర్​లోని అద్దాలు, ఫర్నీచర్​, ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రేక్షకులను అదుపు చేశారు. ఇరు మధ్య గొడవను పరిష్కరించారు. ఈ ఘటనపై స్పందించిన యాజమాన్యం వెంటనే టికెట్​ కొనుగోలు చేసిన వారందరికి తిరిగి డబ్బులు చెల్లించింది.

ABOUT THE AUTHOR

...view details