తెలంగాణ

telangana

Vijayendra Prasad

ETV Bharat / videos

Vijayendra Prasad Visited TS Secretariat : 'అసాధ్యాలను సుసాధ్యం చేయడం.. కేసీఆర్​కే సాధ్యం' - హైదరాబాద్ తాజా వార్తలు

By

Published : May 19, 2023, 2:31 PM IST

Vijayendra Prasad Visited TS Secretariat : అతి తక్కువ సమయంలో ఇంత గొప్ప సచివాలయాన్ని నిర్మించడం అద్భుతమని రాజ్యసభ సభ్యుడు, ప్రసిద్ధ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కొత్త సచివాలయాన్ని ఆయన సందర్శించారు. వారసత్వం, సాంస్కృతిక వైభవం, ఆధునికతల కలబోతకు నిలువెత్తు నిదర్శనంగా సచివాలయం ఉందని ప్రశంసించారు. ఆయన పట్టుదల, అకుంఠిత దీక్షతో అద్భుతమైన దేవాలయాలను, ప్రజా నిర్మాణాలను కేసీఆర్‌ చేస్తున్నారన్నారు. మనుషులు రుషులవుతారనే నానుడిని... ముఖ్యమంత్రి నిజం చేస్తున్నారని విజయేంద్రప్రసాద్‌ కొనియాడారు. 

తన కలంతో ప్రపంచం మెచ్చిన బాహుబలి, ఆర్​ఆర్​ఆర్​ వంటి పాన్ వరల్డ్ సినిమాలను అందించిన విజయేంద్ర ప్రసాద్.. కేసీఆర్​ నాయకత్వంపై హర్షం వ్యక్తం చేశారు. పది నెలల సమయంలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణం, అంతకు మించిన ప్రజా సచివాలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయమన్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్​కే సాధ్యమని కొనియాడారు. కేసీఆర్​ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతుందన్నారు. ఈ అభివృద్ధి పట్ల తెలంగాణ బిడ్డగా చాలా సంతోషంగా ఉందంటూ విజయేంద్ర ప్రసాద్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు .

ABOUT THE AUTHOR

...view details