Family Suicide Attempt at Pragathi Bhavan : డబుల్ బెడ్ రూమ్ కోసం ప్రగతిభవన్ ఎదుట దంపతుల ఆత్మాహత్యాయత్నం.. - Couple Suicide Attempt For Double Bed Room
Published : Oct 12, 2023, 5:35 PM IST
Family Suicide Attempt at Pragathi Bhavan :హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయం ప్రగతి భవనం వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం లేపింది. ఈ ఘటన సోమవారం జరిగి మూడురోజులు గడిచినా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుత్బుల్లాపూర్, ప్రగతినగర్‌కు చెందిన మహేందర్ కుటుంబం డబుల్ బెడ్ రూమ్ కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అందిస్తామని చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తాము ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకున్నామని.. తమకు బెడ్ రూమ్ ఇవ్వలేదని అన్నారు. 8 ఏళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం వేచి ఉన్నామని తెలిపారు.
మొదట మంజూరు అయిందని ఫోన్ చేశారని.. సంవత్సరం తర్వాత కేటాయించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులకు తమ గోడు విన్నపించుకున్నా.. ఫలితం లేదని వాపోయారు. పేదలకు అందవలసిన రాష్ట్ర సంక్షేమ ఫలాలు నిర్వీర్యమవుతున్నాయంటూ.. చాలా చోట్ల ఇళ్లు ఉన్నవారికే మళ్లీ కేటాయింపులు జరుగుతున్నాయని ప్రగతిభవన్ వద్ద ఒంటిమీద కిరోసిన్ పోసుకొని మహేందర్ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సకాలంలో పోలీస్ సిబ్బంది స్పందించి.. అడ్డుకోవడంతో ముప్పు తప్పింది.