తెలంగాణ

telangana

మృతదేహాన్ని మోస్తూ ప్రమాదకర నదిని దాటిన కుటుంబ సభ్యులు

ETV Bharat / videos

అంత్యక్రియల కోసం తీవ్ర ఇక్కట్లు.. మృతదేహాన్ని మోస్తూ నదిని దాటిన బంధువులు - అంత్యక్రియల కోసం నది గుండా ప్రమాదకరమైన ప్రయాణం

By

Published : Jul 24, 2023, 10:45 PM IST

గత కొద్ది రోజులుగా ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రవాప్తంగా ఉన్న నదులు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల నదులకు అడ్డంగా వంతెనలు లేని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొరాపుట్ జిల్లాలోని లక్ష్మీపుర్ బ్లాక్ పరిధిలో ఉన్న వివిధ ప్రాంతాల ప్రజల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. భార నది ఈ ప్రాంతానికి సమీపంగా ప్రవహిస్తుండటం, దీనిపై వంతెన లేకపోవటం వల్ల.. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

చారడ గ్రామంలో సోమవారం ఓ వ్యక్తి చనిపోయాడు. భార నది ఉద్దృతంగా ప్రవహిస్తున్న కారణంగా మృతుడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంత్యక్రియలు నిర్వహించే చోటుకు వారంతా చేరుకోవాలంటే భార నది దాటాల్సి ఉంటుంది. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిని.. మృతుడి బంధువులు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని దాటుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. దీంతో ఓ పక్క రోదిస్తూనే మరో పక్క నది దాటారు మృతుని బంధువులు, కుటుంబసభ్యులు.

ఈ నదిపై వంతెన నిర్మించమని చాలా సార్లు అధికారులకు మొర పెట్టుకున్నామని స్థానికులు చెబుతున్నారు. అయినా ఫలితం లేకపోయిందని వారు వాపోయారు. స్కూల్​కి వెళ్లే పిల్లలకు, రైతులకు ఈ నది దాటడం తీవ్ర సమస్యగా మారింది వివరించారు. ఎలాగైనా తమ సమస్యను పరిష్కరించాలని అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details