అయోధ్య రాముడికి 2,500 కేజీల భారీ గంట- ఓంకార నాదం వచ్చేలా తయారీ - అయోధ్య రామమందిరం బెల్ బరువు
Published : Nov 26, 2023, 7:32 PM IST
Family Donated 2500 kg Bell To Ayodhya Ram Mandir :అయోధ్య రాముడి కోసం 2,500 కిలోల భారీ గంటను సిద్ధం చేసి విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమైంది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం. రూ.25 లక్షలు వెచ్చించి దీనిని రూపొందిస్తున్నారు ఎటా జిల్లాకు చెందిన గంటలు తయారు చేసే మిట్టల్ కుటుంబం. దీనిని మోగించినపుడు.. ఓంకార శబ్దం రావడం దీని ప్రత్యేకతని తయారీదారులు చెబుతున్నారు. ఈ గంటను జింక్, రాగి, సీసం, టిన్, నికెల్, వెండి, బంగారం వంటి 8 లోహాలతో తయారు చేశామని చెప్పారు. ఇది 6 అడుగుల ఎత్తు, 5 అడుగుల పొడవు, 15 అడుగుల వ్యాసార్థం ఉంటుందని వివరించారు. దీనిని తయారు చేయడానికి 250 మంది కార్మికులు పాల్గొన్నారని.. సుమారు మూడు నెలలు పట్టిందని నిర్వాహకులు తెలిపారు.
"కొత్తగా నిర్మిస్తున్న రామమందిరానికి గంటను తయారు చేసి ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. దీని కోసం శ్రీ రామ మందిర నిర్మాణ ట్రస్ట్‌ను సంప్రదిస్తే అంగీకరించారు. ఈ గంటను రూపొందించడానికి చాలా కష్టపడ్డాం. మొదట 1700 కిలోల బరువుతో గంటను తయారు చేయాలనుకున్నాం.. తర్వాత 1900 కిలోలు.. చివరగా ఇప్పుడు 2500 కిలోలు బరువుతో తయారు అవుతుంది"
--ఆదిత్య మిట్టల్, గంట తయారీదారుడు
TAGGED:
అయోధ్య రామమందిరం బెల్ బరువు