Fake Insecticides Selling Gang Arrested : నకిలీ, గడువు తీరిన పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
Fake Insecticides Selling Gang Arrested : గడువు తీరిన పురుగు మందులను విక్రయిస్తూ రైతులను దగా చేస్తున్న 11 మంది ముఠా సభ్యులను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.57 లక్షల విలువ చేసే గడువు తీరిన, నకిలీ పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి నకిలీ పురుగు మందులు, ఖాళీ సీసాలు, ప్రింటర్‌తో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. రూ.30 లక్షల విలువ చేసే నకిలీ పురుగు మందులతో పాటు రూ.24 లక్షల విలువ చేసే గడువు తీరిన పురుగు మందులను.. మరో రూ.మూడున్నర లక్షల విలువ చేసే నిషేదిత గడ్డి మందులను స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టు చేసిన వారిలో పలువురిపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నామని సీపీ రంగనాథ్ తెలిపారు. దుకాణ యాజమాని నుంచి ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేసిన బిల్లును రైతులు భద్రపరుకోవాలని అన్నారు. నకిలీ పురుగు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.