తెలంగాణ

telangana

Hyderabad Currency Scam

ETV Bharat / videos

Fake Currency Hyderabad : చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రింట్ చేసిన నోట్లు చూశారా..? - Duplicate Currency issue in Oldcity

By

Published : Aug 9, 2023, 2:53 PM IST

Fake Currency Hyderabad :హైదరాబాద్ పాతబస్తీ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 32 లక్షల విలువైన నకిలీ నోట్లు వెలుగు చూశాయి. జాహెద్ అనే వ్యక్తి వద్ద నుంచి ఈ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నవీద్‌ అనే వ్యక్తి... జాహెద్‌కు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలోనే  కొంపల్లి సుచిత్ర వద్దకు జాహెద్‌ను పిలిచిన నవీద్‌ రూ. 32లక్షలను ఓ పార్శిల్‌  కవర్‌లో పెట్టి ఇచ్చి వెళ్లిపోయాడు. 

Fake Currency Oldd City : ఆ తర్వాత జాహెద్ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధి మోచి కాలనీలో తన స్నేహితుడు ఇంటికి వెళ్లి.. పార్శిల్ కవర్ విప్పి చూసేసరికి అవి నకిలీ నోట్లని గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు జాహెద్. కేసు నమోదు చేసుకున్న కాలాపత్తర్ పోలీసులు నకిలీ నోట్లను జప్తు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నవీద్ కొరకు గాలింపు చేస్తున్నారు. అయితే జప్తు చేసిన 2 వేల నోట్లపై చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్ర ఉంది. 

ABOUT THE AUTHOR

...view details