సైన్స్ ఎగ్జిబిషన్లో పేలిన రాకెట్ విద్యార్థులకు గాయాలు
ఓ కళాశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్లో స్వల్ప పేలుడు సంభవించింది. ప్రదర్శనలో భాగంగా ఫిజిక్స్ విద్యార్థులు చేసిన రాకెట్ ప్రయోగంలో లోపం తలెత్తి ఈ పేలుడు జరిగింది. ఈ ప్రమాదం ఝార్ఖండ్ తూర్పు సింగ్భూమ్ జిల్లాలోని ఘట్శిలాలో జరిగింది. వాస్తవానికి ఈ ప్రయోగంలో రాకెట్ పైకి వెళ్లిన అనంతరం పేలుడు జరగాలి. అయితే ప్రయోగం చేసే విద్యార్థి, రాకెట్ పైకి వెళ్లక ముందే పొరపాటున పేలుడు జరిగే బటన్ నొక్కాడు. దీంతో రాకెట్ కిందే పేలింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో 11 మంది విద్యార్థులు గాయపడ్డారు. వెంటనే విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు ఉపాధ్యాయులు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST