TSPSC రద్దయిన పరీక్షలు మళ్లీ ఎప్పుడు..? సన్నద్ధం కావడం ఎలా? - How to achieve group 1
TSPSC Group 1 Exam: ఇప్పుడు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాలు, ఆ పోటీ పరీక్షల కోసం ఎదురు చూస్తున్న, సన్నద్ధం అవుతున్న పరిస్థితి ఏమిటి? కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అందరిలో ఇదే ప్రశ్న. రద్దయైన నోటిఫికేషన్లు, వాయిదా వేసిన పరీక్షల విషయంలో కొత్తతేదీల ఖరారు కోసం విస్తృత కసరత్తు చేస్తోంది టీఎస్‌పీఎస్సీ. ఊహించని చేదు అనుభవాల నేపథ్యంలో ఇకపై పగడ్బందీగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయడంలో తలమునకలైంది. మరిప్పుడు ఉద్యోగార్థుల ముందున్న సవాళ్లు ఏమిటి? నిరాశ, నిస్ఫృహలు, ఒత్తిళ్లు దాటి కలల కొలువుల సాధన వైపు మళ్లీ సన్నద్ధం కావడం ఎలా? అందుకు పాటించాల్సిన సూచనలు, మెళకువలు ఏమిటి? టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ జరిగిన తరువాత కొన్ని పరీక్షలను కమిషన్ రద్దు చేయగా.. మరికొన్ని వాయిదా వేసింది. తాజాగా రద్దయినా వాటిని కేంద్ర ప్రభుత్వ, వివిధ పోటీ పరీక్షల తేదీలు పరిశీలించి వాటికి ఆటంకంకలగకుండా కొత్తతేదీలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రూప్1, గ్రూప్2, గ్రూప్4 పరీక్షలకు మధ్య వ్యవధిని పరిశీలించి ఆ మేరకు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.