ఎగ్జిట్ పోల్స్ వెర్సెస్ ఎగ్జాట్ పోల్స్ - సర్వేల్లో ప్రజాభిప్రాయం తెలుస్తుందా? - తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
Published : Dec 2, 2023, 9:45 PM IST
Telangana Exit polls and exact polls 2023 : దేశంలో ఎన్నికలు ఎక్కడ జరిగినా పోలింగ్ రోజు ఎగ్జిట్ పోల్స్ వెలువడటం అందరికీ తెలిసిందే. అయితే అవి ప్రజల మూడ్‌ను ఎంతవరకు ప్రతిబింబిస్తాయి అనేదే ఎప్పుడూ చర్చనీయాంశం. అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రీపోల్ సర్వేలు చేస్తారు. పోలింగ్ రోజు ఎగ్జిట్ పోల్స్ చేస్తారు. గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలను బేరీజు వేసి చూస్తే ఎగ్జిట్ పోల్స్ నిజంగానే ఎగ్జాట్ పోల్స్ అయ్యాయా? వాటి సక్సెస్ రేట్ ఎంత? ప్రజల నుంచి శాంపుల్స్ ఎలా సేకరిస్తారు? ఎలా క్రోఢీకరిస్తారు?
అంత తక్కువ శాంపుల్స్‌తో ప్రజాభిప్రాయం ఎలా ప్రతిబింబిస్తుంది? ఇదీ నేటి ప్రతిధ్వని. ఓటర్లు చూస్తే కోట్లల్లో ఉంటారు. సర్వేలకు తీసుకున్న శాంపుల్స్ చూస్తే వేలల్లో ఉంటాయి? ఇవెలా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి? అసలు ఎన్నికల సర్వేలు చేయాలంటే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంత ఖర్చు అవుతుంది? ప్రజల మనస్సులో ఏం ఉందో తెలుసుకోవటానికి వెళ్లేప్పుడు మీకు ఎటువంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి?