మా సత్తా ఏంటో ఇప్పుడు చూపిస్తాం - మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాట్ కామెంట్స్ - Mahbubabad district latest news
Published : Dec 15, 2023, 1:01 PM IST
Ex MLA Shankar Nayak comments on Congress Govt : కాంగ్రెస్ పార్టీకి 90 రోజుల తర్వాత అసలు విషయం తెలుస్తుందని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ అసలు సత్తా చూపిస్తామన్నారు.
తమను ఆపే శక్తి ఎవరికీ లేదని శంకర్ నాయక్ పేర్కొన్నారు. నియోజకవర్గ కార్యకర్తలకు తాను 24 గంటలూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కొంతమంది పార్టీలో ఉంటూ తనను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లోనే ఉంటూ కాంగ్రెస్ కోసం పని చేశారని దుయ్యబట్టారు. తాను భూ కబ్జాలకు పాల్పడ్డానని అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు. వాటిని నిరూపించాలని సవాల్ విసిరినా ఎవరు నిరూపించలేకపోయారన్నారు. మానుకోటలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధే కనిపిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తట్టెడు మట్టి కూడా పోయదని ఎద్దేవా చేశారు.