కేసీఆర్‌ను పరామర్శించిన మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు - KCR Operation
Published : Jan 7, 2024, 5:32 PM IST
Ex Governor ESL Narasimhan Meet Ex CM KCR in Hyderabad : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తెలంగాణ మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పరామర్శించారు. కేసీఆర్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బంజారాహిల్స్‌లోని నందినగర్ చేరుకున్న మాజీ గవర్నర్ దంపతులు కేసీఆర్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. నరసింహన్ దంపతులను తొలుత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలో పూర్తిస్థాయిలో కోలుకోవాలని మాజీ గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. కేసీఆర్ సతీమణి శోభతో పాటు ఇతర కుటుంబసభ్యులను పలకరించారు.
కేసీఆర్ నివాసానికి వచ్చిన అతిథులకు కేసీఆర్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించి సంప్రదాయ పద్ధతిలో అతిథి మర్యాదలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాజీ హోంమంత్రి మహమూద్ అలీ కూడా కేసీఆర్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.