తెలంగాణ

telangana

Ex Central Minister Renuka chowdary Travelled in Bus

ETV Bharat / videos

ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్న కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి - కాంగ్రెస్ పాలనపై కాంగ్రెస్ నేత రేణుక

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2023, 5:35 PM IST

Ex Central Minister Renuka chowdary Travelled in Bus :దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే దేశమంతా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. తోటి మహిళలతో కలిసి ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత ప్రయాణం మహిళలకు చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ పథకం వల్ల వారు బస్సులో ప్రయాణించడానికి వినియోగించే డబ్బులు ఆదా అవుతున్నాయని చెప్పారు. 

కర్ణాటక తరహా ఇక్కడ కూడా ఉచిత ప్రయాణ పథకాన్ని చాలా విజవంతంగా అమలు చేస్తున్నామని రేణుకా చౌదరి పేర్కొన్నారు. కూలీ పనులు చేసే వారికి, వృద్ధులకు, కాలేజీ విద్యార్థులకు, వికలాంగులకు మహాలక్ష్మి పథకం చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. ఉచిత ప్రయాణం పథకం వల్ల ప్రజారవాణా శాతం పెరిగే అవకాశాలు ఉన్నందున మూడు, నాలుగు నెలలు చూసి ఏం సమస్యలు తలెత్తుతున్నాయే పరిశీలించి అవసరమైతే కొత్త బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. 

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details