తెలంగాణ

telangana

ETV Bharat / videos

PRATHIDHWANI పేదలు మరింత పేదలవుతుంటే ధనికులు ఎలా పెరుగుతున్నారు

By

Published : Jan 17, 2023, 8:51 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

 ధనికదేశం... ప్రజలే పేదలు. చాలాకాలంగా ఉన్న ఈ నిష్ఠూర సత్యాన్ని మరోసారి మొహానికి కొట్టినట్లు చెప్పింది... ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్ నివేదిక. దేశంలో 40% సంపద ఒక్కశాతంమంది చేతుల్లోనే ఉంది. 50% జనాభా కేవలం 3% సంపదతో జీవిస్తున్నారని... అంతరాల తీవ్రతను తెలియజేసింది. దశాబ్దకాలంగా పేద-ధనికుల మధ‌్య ఆ అగాథం పెరుగుతూ వచ్చిందని తెలిపింది. అసలు... కొవిడ్ వల్ల సంపన్నదేశాలే సంక్షోభంలో పడ్డాయి. అలాంటి సమయంలో కూడా భారత దేశ కుబేరుల సంపద మాత్రం 121% పెరిగింది. ఇదెలా సాధ‌్యమైంది? ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఆర్థిక అసమానతలు ఎక్కడికి దారి తీసే ప్రమాదం ఉందని... ఎలాంటి దిద్దుబాటు అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details