Pratidwani: అక్రమనిర్మాణాలకు అడ్డుకట్ట ఎలా? - ప్రతిధ్వని
Pratidwani: అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘన! 8మంది ప్రాణాలు బలిగొన్న సికింద్రాబాద్ రూబీ హోటల్ ఘటన తర్వాత మరొకసారి ప్రధానంగా చర్చ జరుగుతోన్న విషయం ఇది. ఇంతకు ముందు కూడా ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. అయినా అదే పరిస్థితి కొనసాగుతోంది. లక్షల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఆకాశంలోకి లేస్తుంటే.. అడ్డుకట్ట వేయాల్సిన యంత్రాంగం ఎందుకు చోద్యం చూస్తోంది. నూతన మున్సిపాలిటీ చట్టం స్ఫూర్తి సరే... కానీ ఇప్పటికే జరిగి పోయిన ఉల్లంఘనల మాట ఏమిటి? పదేపదే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకూడదంటే తక్షణం చేపట్టాల్సిన కార్యాచరణ ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST