Pratidwani : జ్వరాల ముట్టడి... జాగ్రత్తలు తప్పనిసరి - ఈటీవీ ప్రతిధ్వని
Published : Sep 12, 2023, 9:58 PM IST
Pratidwani : రాష్ట్రాన్ని జ్వరాల ముట్టడి వణికిస్తోంది. వాతావరణ మార్పులతో ఆస్పత్రులన్నీ జ‌్వర పీడితుల కిటకిటలాడుతున్నాయి. డెంగీతోపాటు... మలేరియా, టైఫాయిడ్, అతిసారం కేసులు భారీగా వస్తున్నాయి. ఆగస్టులో నమోదైన కేసులతో పోలిస్తే సెప్టెంబరు 10వ తేదీ వరకు... అమాంతం పెరిగాయి. రానున్న రోజుల్లో జ్వరాల కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి బాధితులు సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆదిలాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో గత నెల మొత్తం వచ్చిన కేసులు ఈ నెల 10రోజుల్లోనే నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. రోజురోజుకీ ఈ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వెంటనే దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే పట్టణాలతో పాటు గ్రామాల్లో జ్వర పీడితుల సంఖ్య పెరిగిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి తలెత్తే ప్రమాదం లేకపోలేదు.
ఎందుకీ పరిస్థితి? తక్షణం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.