PRATIDWANI : ఐటీలో నెంబర్‌వన్ దిశగా తెలంగాణ పరుగులు..!
Published : Aug 28, 2023, 9:29 PM IST
PRATIDWANI : ఐటీ రంగంలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. వార్షిక ఎగుమతులు..., కొలువుల కల్పన పరంగా.. దేశంలోనే ముందంజలో నిలుస్తోంది రాష్ట్రం. ఇది ఎవరో నోటిమాటగా చెబుతున్న ముచ్చట కాదు. 2022-23 ఆర్థిక సంవత్సరం గణాంకాలే ఇక్కడి ఐటీ రంగం జోరుకు.. అద్ధం పడుతున్నాయి. దేశంలో కొత్తగా వస్తోన్న ఐటీ ఉద్యోగాల్లో 30 నుంచి 40% తెలంగాణ నుంచే అంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ రంగంలో జోరు తాారస్థాయికి చేరింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ శాఖలను భాగ్యనగరంలో ఏర్పాటు చేసేందుకు బారులు తీరాయి. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న ప్రోత్సాహం, చౌకల లభించే మౌలిక వసతులు.. ఇవన్నీ హైదరాబాద్‌ను హాట్ స్పాట్‌గా మర్చాయంటున్నాయి జాతీయ స్థాయి గణాంకాలు. మరి, ఐటీలో రాష్ట్రం ఇంతటి జోరుకు కారణాలు ఏమిటి? దేశవ్యాప్తంగా ఐటీ రేసులో తెలంగాణను, భాగ్యనగరాన్ని ఏ ఏ అంశాలు ప్రత్యేక స్థానంలో నిలుపుతున్నాయి? రానున్న రోజుల్లో తెలంగాణ ఐటీ ఇంకా ఏ స్థాయిలో, ఎలా ఉండొచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.