కోటి మంది ఉంటున్న గ్రేటర్ ఓటరు మదిలో ఉన్నదెవరు? - తెలంగాణ ఎన్నికల్లో జీహెచ్ఎసీ సీట్ ప్రాముఖ్యత
Published : Nov 9, 2023, 9:45 PM IST
Pratidwani : హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల కోలాహలంలో నామినేషన్ల ఘట్టం కూడా తుదిఅంకానికి చేరుకుంది. 119స్థానాల్లో వందలాదిమంది అభ్యర్థులు బరిలో నిలిచి గెలుపు మాదంటే మాదంటున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ పోటీ అంతా ఒకెత్తయితే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధి, ఇక్కడ ఉన్న 29 అసెంబ్లీ స్థానాలు మరో ఎత్తు. పార్టీల గెలుపుఓటముల్ని శాసించగల స్థాయిలో ఇన్ని స్థానాలు ఒక్కచోట ఉండడమే అందుకు కారణం? అంతేకాక రాష్ట్రంలోని మిగిలిన సెగ్మెంట్లన్నిటికీ భిన్నంగా ఉండే, విభిన్న సమీకరణాలతో ముడిపడి ఉండే ఈ గ్రేటర్ రేసులో ఏ పార్టీ ఎక్కడ?
కోటికి చేరువైన గ్రేటర్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వారి వ్యూహాలేంటి? ఏ ఏ అంశాలు ఇక్కడ కీలకం కానున్నాయి? రాష్ట్ర ఆర్థిక వనరులకే కాదు, రాజకీయ సమీకరణాల్లో గుండెకాయలాంటి గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం 20కి పైగా సిట్టింగ్‌లతో ఎవరికీ అదనంత ఎత్తులో ఉంది బీఆర్ఎస్. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? గ్రేటర్ పరిధిలో ఎన్ని సీట్లు సాధిస్తారు? రూపుమారుతున్న హైదరాబాద్, ఐటీ, పారిశ్రామిక పెట్టుబడుల్లో తిరుగులేని జోరు వంటి సానుకూలతలతో పాటే.. మౌలిక వసతులు, వరదల నిర్వహణ, గృహ నిర్మాణం, రేషన్‌కార్డులు జారీలో జాప్యం వంటి ప్రతికూలతలు కూడా ఎదుర్కొంటోంది బీఆర్ఎస్. వీటినెలా అధిగమిస్తారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.