Pratidwani : భాగ్యనగరానికి వాన భయం..!
Pratidwani : రాజధాని హైదరాబాద్‌ను మరోసారి వర్షాలు భయపెడుతున్నాయి. గతవారమే వర్షాల ధాటికి 2 రోజులు సెలవులు ప్రకటించి ఊపిరి పీల్చుకున్నా... ప్రస్తుతం మాత్రం.... వర్షాకాలం కష్టాలకు ఎదురీదుతున్నారు నగర పౌరులు. వందలాది బస్తీలు, కాలనీలు వాననీటి నానుతూ మాకెన్నాళ్లీ దుస్థితి అని దీనంగా ప్రశ్నిస్తున్నాయి. అరగంట వానకే రోడ్లపైకి పొంగుతున్న వాననీటితో గంటల కొద్దీ... ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. చిన్న పాటి వానకే హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కేవలం 2 సెంటీమీటర్ల వర్షాన్ని మాత్రమే హైదరాబాదీ నాలాలు తట్టుకోగలవు. అంతకంటే ఎక్కువ వాన పడితే అంతే సంగతులు. నిన్న రాత్రి అదే జరిగింది. 2 గంటల వ్యవధిలో పలుచోట్ల 5 నుంచి 8 సెంటీమీటర్ల వర్షం పడింది. అసలు భాగ్యనగరానికి ఎందుకీ వాన భయం? పీడకలగా మిగిలినపోయిన 2020 వరదల నుంచి నేర్చుకున్న పాఠాలు ఏమిటి? వానాకాలం హైదరాబాద్ ప్రజల ముంపు, ట్రాఫిక్ కష్టాలు తీర్చే శాశ్వత పరిష్కారం ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.