మినరల్ వాటర్లో నాణ్యత ఎంత..?
Pratidwani: దేశంలో రోజురోజుకు విస్తరిస్తున్న వ్యాపారాల్లో వాటర్ బిజినెస్ ఒకటి. మనం బయటకు వెళితే చాలు.. మినరల్ వాటర్ బాటిల్ కొనాల్సిందే. కొళాయి నీటిని తాగడం ఎప్పుడో మానేశాం. హోటల్స్, రెస్టారెంట్లలో వారు ఇచ్చే నీటిని తాగడమే లేదు. ఎవరికైనా కావాల్సింది మినరల్ వాటరే. చివరకు ఇంట్లో కూడా మినరల్ వాటర్ క్యాన్ నీటినే తాగుతున్నాం. ఇలా వేల కోట్ల రూపాయల వ్యాపార స్థాయికి చేరిన డబ్బా నీళ్లలో అనేక రకాల బ్రాండ్లు... అనేక రకాల ప్రచారాలతో ప్రజల ముందుకు వస్తున్నాయి. ఎవరు చెప్పేది నిజం.. ఎవరు చెప్పేది అబద్ధం... ఈ ప్రచార ముసుగులో వేటిని నమ్మాలి? ఎలా నమ్మాలి? అసలు.. మినరల్‌వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటే ఎవరైనా ఏం నిబంధనలు పాటించాలి? ఆ నీటిని కొనేటప్పుడు ప్రజలు ఏం గమనించాలి? ప్రభుత్వం ఇచ్చే కుళాయి నీరు... ఈ డబ్బా నీళ్లకు అసలు వ్యత్యాసాలేంటి? ప్రజలు ఆరోగ్యం రీత్యా ఏది మేలు? నీటి వినియోగాన్ని ఎలా ఎంచుకోవాలి? డబ్బా నీళ్లపై ఫిర్యాదులు ఉంటే ఎవరిని ఆశ్రయించాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.