Pratidwani మహానగరంలో గమ్యం చేరే మార్గమేది - ప్రతిధ్వని
Pratidwani మెట్రో రైల్ రెండోదశ విస్తరణ కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే రాజధానిలో ప్రజారవాణ ముఖచిత్రంలో ఎక్కడున్నాం.. నగర జనాభా... ప్రస్తుత, భవిష్యత్ అవసరాలు రీత్యా సరైన దిశలో సాగుతున్నాయా? దాదాపు 10వేల బస్సులు అవసరమైన మహానగరంలో 2వేల 500 మేరనే ఉన్న బస్సులతో అవసరాలు తీరేది ఎలా? అత్యంత చౌకైన ప్రజారవాణ సాధనంగా ఉన్నది ఎంఎంటీఎస్ ఆ సేవల విస్తరణ విషయంలో చర్యలు ఎలా ఉన్నాయి? బస్సు, ఎంఎంటీఎస్, మెట్రో దిగిన తర్వాత గమ్యస్థానం చేరుకోవాలన్నా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. నిత్యం ప్రతిఒక్కరు ఎదుర్కొనే ఈసమస్యకు పరిష్కారం ఏమిటి? ప్రజలకు ఇబ్బందుల్లేని ప్రజారవాణ వ్యవస్థ ఎలా ఉంటే మేలు? ఈ అంశాలపై ప్రతిధ్వని..
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST