ఆర్టీసీ కార్మికుల కష్టాలు తీరేదెన్నడు..? - హైకోర్టులో ఆర్టీసీ ఉద్యోగుల పిటిషన్
Pratidwani: వర్ణనాతీతంగా మారాయి ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలు. O.D.కి వెళితే తప్ప జీతాలు కూడా సక్రమంగా అందని పరిస్థితి. పని గంటలు పెరిగాయే తప్ప.. వేతనాలు మాత్రం మారలేదు. రాష్ట్రం వచ్చాక రిటైర్ అయినవాళ్లే తప్ప, కొత్తగా నియామకాలు లేవు. కారుణ్య నియామకాల సంగతి సరేసరి. ఈ తొమ్మిదేళ్లలో వేతన సవరణ ఊసే లేకపోగా... 2103 P.R.C బకాయిలు ఇప్పటికే అందలేదు. ఛార్జీల సవరణతో ఏటా సంస్థ ఆదాయం పెరుగుతున్నా.. తమ స్థితి మాత్రం మారడం లేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. కొత్త స్కీములు, ఆకర్షణీయ పథకాలతో ప్రయాణికులను ఆకర్శిస్తూ సంస్థ జేబు నిండుతున్నా.. తమ జేబులు మాత్రం ఖాళీగానే ఉంటున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా బుట్టదాఖలే తప్పా.. పట్టించుకున్న పాపానపోలేదన్నది వారి వాదన. చివరకు ఇప్పుడు ఆర్టీసీ ఎన్నికలు నిర్వహించాలని ఏకంగా హైకోర్టులోనే పిటిషన్ వేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అసలు ఎందుకీ పరిస్థితి? ఏంచేస్తే వారి కష్టాలు గట్టెక్కే అవకాశం ఉందనే అంశాలపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చ.