ప్రజావాణి - ముఖ్యమంత్రి ముద్ర - ప్రతిధ్వని
Published : Dec 13, 2023, 9:10 PM IST
Pratidwani : ప్రచార సమయంలోనే రాబోతున్నది ప్రజాప్రభుత్వం అన్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచి అదే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణకు ముందే ఆ దిశగా అందరికీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన సీఎం క్రమంగా తమ ప్రభుత్వ ఉద్ధేశాల్ని అర్థమయ్యేలా చేస్తున్నారు. అందులో అత్యంత ముఖ్యమైనది ప్రజావాణి. ప్రజల నుంచి స్వయంగా ముఖ్యమంత్రే వినతులు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కేంద్రంగానే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజావాణికి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. అందులో కొన్నింటికి అక్కడిక్కకడే పరిష్కారం లభిస్తుండగా మరికొన్నింటిని ఆయా శాఖల వద్దకు పంపిస్తున్నారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల్లో చాలా వరకు భూముల తగాదాలే ఉంటున్నారు. ఉద్యోగాలు కోరుకునే వారు కూడా భారీగానే ఉన్నారు. ఇంతటి ప్రజాదరణ ఉన్న ప్రజావాణి విషయంలో ముఖ్యమంత్రి ఆలోచనలు ఏంటి? అవి ప్రజల మదిలో ఎలాంటి ముద్ర వేసే అవకాశం ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.