రాహుల్‌పై వేటు... రాజకీయ ప్రకంపనలు - రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు
Pratidwani: కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు.. రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు ప్రకంపనలు కొనసాగుతునే ఉన్నాయి. సూరత్ కోర్టు నుంచి తీర్పురావడం.. ఆ వెంటనే లోక్‌సభ సచివాలయం ఆయన్ను అనర్హుడిగా ప్రకటించినంత వేగంగా... సద్దుమణిగేలా కనిపించడం లేదు ఈ పరిస్థితులు. దేశవ్యాప్తంగా ఈ అంశం సంచలనంగా మారింది. బీజేపీ నాయకత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలు మోదీ సర్కార్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నాయి. మేధావులు కూడా ఈ అంశంపై స్పందిస్తున్నారు. అసలు దీని ద్వారా బీజేపీ ఇచ్చిన సందేశం ఏంటి... వారి వ్యూహాలు ఏమిటి? అదానీ దుమారంపై సమాధానం చెప్పలేకనే.. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ ఎత్తుగడ అన్న కాంగ్రెస్‌పార్టీ, ఇతర విపక్షాల వాదనలో బలం ఎంత? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష ముఖ్య నాయకుడిని పార్లమెంట్‌కు దూరంలో చేయడం ఎలాంటి సంకేతాలు ఇస్తోంది? 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదంతా ఎవరికి ప్లస్... ఎవరికి మైనస్... ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.