Pratidwani ఖాకీవనంలో కలుపు మొక్కలు - పోలీసుల ఆగడాలపై ఈటీవీ చర్చ
Pratidwani: అనైతిక అధికారులపై పోలీసు శాఖ ఇటీవల కొరఢా ఝళిపిస్తోంది. రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో కొందరిపై తీవ్ర ఆరోపణలు వస్తుండటంతో.. వారిపై చర్యలు చేపట్టింది. 10 నెలల్లో 55 మంది పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటు పడింది. ఇందులో తోటి మహిళా పోలీసుల్ని లైంగికంగా వేధించినవారు, అక్రమ సంబంధాలు, రియల్ దందాలు, సుపారీ గ్యాంగులతో లింకులున్న వారు ఉన్నారు. పోలీస్ శాఖలో ఈ ధోరణి ఆగేదెలా... లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన వారే ఎందుకిలా మారుతున్నారు. ఈ చర్యలపై మిగతా వారిలో దిద్దుబాటు మొదలవుతుందా.. పోలీసుల ఆగడాలు ఎంతవరకు ఆగుతాయి.. ఇవాళ్టి ప్రతిధ్వనిలో చూద్దాం..
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST