Pratidwani: శివతత్వాన్ని ఎలా అన్వయించుకోవాలి?
Pratidwani: మహా మహిమాన్వితం... మహా శివరాత్రి పర్వదినం. ఉపవాస, జాగరణలే కాదు... మరెన్నో ఆధ్యాత్మిక, జీవన సందేశాలున్న సుదినం. ఆది అంతం లేని లింగరూపంలో అవతరించిన పరమేశ్వరుడిని బ్రహ్మా, మురారి, సురులు అర్చించిన రోజు ఈ మహా శివరాత్రి. అసలు పరమశివుని ఆశయం ఏమిటి.. శివతత్వం అంటే ఏంటి..?. అసలు శివతత్వాని గురించి మాట్లాడటం చాలా కష్టం. వేదవేదంగాల అధ్యయనం, నియమ నిష్టల మధ్య జీవనం సాగిస్తేనే కానీ శివతత్వం అంత సులభంగా అర్థం కాదు. అసలు శివుడు ఓ ఆకారమా.. లేదంటే ఒక వ్యక్తా..?.. సమస్త విశ్వమూ శివుడే అనుకునే మనం కైలాసంలో ఉంటాడని ఎలా అనుకోగలం. సకల చరాచర సృష్టికి మూలం ఆ పరమశివుడు. సృష్టించే వాడు.. నిర్జించే వాడు ఆ బోళా శంకరుడే. ఆది అంతాలకు మూలమైన ఆ నీలకంఠుని అర్థం చేసుకోవడం అంత సులభమా.. మునులు, సన్యాసులు, ఆధ్యాత్మిక వేత్తలు శివతత్వం గురించి చాలానే చెబుతుంటారు.. అయితే అసలు శివుడు మహాదేవుడు ఎందుకయ్యాడు? లింగరూపం ఎందుకు ధరించాడు? ఈసారి మహాశివరాత్రి రోజునే శనిత్రయోదశి కూడా రావడంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? పెద్దలు చెప్పే శివతత్వాన్ని దైనందిన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి? తెలిసీ తెలియక చేసే పాప పరిహారాలకు మహా శివరాత్రి అందించే ఉపశమన మార్గాలు ఏమిటి ? ఈ విశేషాలను మనతో పంచుకోవటానికి ఇద్దరు ఆధ్యాత్మిక వేత్తలు ఈరోజు మనతో ఉన్నారు. ఇదే అంశంపై నేటి ఈటీవీ ప్రతిధ్వని.