Pratidwani: హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రక్షాళన ఎలా..? - ఈటీవీ ప్రతిధ్వని ప్రత్యేక చర్చ
Pratidwani: ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించి... సాన బెట్టి... జాతికి అందించాల్సిన క్రికెట్ సంఘాలు దారితప్పాయి. అవినీతి, అవ్యవస్థతో తీవ్ర విమర్శల పాలైన హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని దారికి తెచ్చేందుకు చివరికి సుప్రీంకోర్టే రంగంలోకి దిగాల్సి వచ్చింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా సంఘాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పెత్తనం సాగిస్తున్న పెద్దలకు చెక్‌పెట్టింది. అధ్యక్ష పదవీకాలం ముగిసినా పెత్తనం వదలని అజహరుద్దీన్‌ను, అంతర్గత కలహాలతో సంఘం ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న పర్యవేక్షక కమిటీని ఇంటికి పంపింది. హెచ్‌సీఏ రోజువారీ కార్యకలాపాలు, ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావుకి అప్పగించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రక్షాళనకి ఏం జరగాలి? జస్టిస్ లావు నాగేశ్వరరావు ముందున్న సవాళ్లు ఏంటి? అనే అంశంపై నేటి ప్రతిధ్వని లైవ్ డిబేట్..