Pratidwani : పాఠశాల ఫీజులు... ప్రభుత్వ నియంత్రణ - పాఠశాలల ఫీజుల నియంత్రణ
Published : Aug 29, 2023, 8:49 PM IST
Pratidwani : రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు మరోసారి కసరత్తు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏ పాఠశాలలో.. ఏ తరగతికి.. ఎంత మొత్తం ఫీజు వసూలు చేస్తున్నారనే సమాచారం ఇకపై కచ్చితంగా చెప్పాల్సిందేనని ఆదేశించింది విద్యాశాఖ. ఈ వివరాలన్నీ సేకరించడంతో పాటు వాటిని జిల్లాలు, పాఠశాలలు, తరగతుల వారీగా ఆన్‌లైన్‌లో పొందుపరచాలని నిర్ణయించింది. ఈ మేరకు డీఈఓలను ఆదేశించడంతో వారు ఆ పనిలో నిమగ్నమయ్యారు. వాస్తవానికి ఫీజుల నియంత్రణకు విద్యాశాఖ 2017 నుంచి పలు ప్రయత్నాలు చేసినా ఫలితాలు కనిపించలేదు. విద్యాసంస్థలు ఏటేటా వారికి ఇష్టం వచ్చినట్లుగా ఫీజాలు పెంచుతున్నా తల్లిదండ్రులు ఏం చేయలేకపోతున్నారు. పేదవారే కాదు మధ్యతరగతి ప్రజలకు కూడా ప్రైవేట్ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించడం వారి స్థోమతకు మించిన భారంగా మారిపోయింది. ఇక ఇంటర్నేషనల్ పేరుతో నడిచే స్కూళ్లలో వారిదే ఇష్టారాజ్యం. ఎల్కేజీ మీడియం వారికి కూడా ఇక్కడ లక్షల్లో ఫీజులు తీసుకుంటారు. వీరందిరికి ముకుతాడు వేసేందుకు విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంతో.. ఫీజుల నియంత్రణ విషయంలో ఓ ముందడుగు పడిందని అనుకోవచ్చా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.