తెలంగాణ

telangana

Pratidwani

ETV Bharat / videos

Pratidwani : ఉగ్ర నీడలు ఇంకెంతకాలం..? - హైదరాబాద్​లో తీవ్రవాదుల కలకలం

By

Published : May 12, 2023, 9:13 PM IST

హైదరాబాద్​లో మళ్లీ తీవ్రవాదుల జాడలు కనిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా నగరం ప్రశాంతంగా ఉందని సంతోషపడే లోపే.. బోపాల్ పోలీసులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ కొందరు ఇస్లామిక్ రాడికల్స్ ఉన్నారని వారిచ్చిన సమాచారం మన కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. 3రోజుల క్రితం నగరంలో దాడులు చేసి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి బోపాల్ తీసుకువెళ్లారు. ఈ దెబ్బకు మన పోలీస్ శాఖ మళ్లీ అప్రమత్తమైంది. ఇన్ని రోజులుగా వారు ఎక్కడున్నారు.. ఏమేం చేశారు.. ఎక్కడ సమావేశమయ్యారు.. వారి లక్ష్యం ఏమిటి.. వారి వద్ద ఆయుధాలు ఏమైనా ఉన్నాయా.. వారికి సహకరిస్తున్న వారు ఎవరు.. విదేశాల్లో ఎవరెవరితో సంభాషించారు.. అంటూ అన్ని రకాలుగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే నగరంలో ఇంత జరుగుతున్న బోపాల్ పోలీసులు వచ్చి చెప్పేవరకు మనకు తెలియలేదంటే.. మనం ఎంత సెక్యూర్​ గా ఉన్నామో అర్థమవుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో పలుమార్లు తీవ్రవాదుల దాష్టికాలకు బలైన నగరం ఇప్పుడు ఎంత వరకు సేఫ్.. గ్లోబల్ ఐకాన్​గా మారుతున్న భాగ్యనగరానికి తీవ్రవాదుల దాడులను ఎదుర్కొనే సత్తా ఉందా.. ఈ అంశాలపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చ.. 

ABOUT THE AUTHOR

...view details