తెలంగాణ

telangana

pd

ETV Bharat / videos

Pratidwani: సైబర్ నేరగాళ్ల కట్టడి ఎలా? - ఈటీవీ ప్రతిధ్వని

By

Published : Feb 23, 2023, 9:22 PM IST

Pratidwani: దేశంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రం ఏదో తెలుసా.. ఏ ఉత్తర్ ప్రదేశో, బిహారో, మహారాష్ట్ర, కర్నాటకనో కాదు.. మన తెలంగాణ. అవును.. తాజా డేటా ప్రకారం దేశంలో ఎక్కువగా సైబర్ నేరాలకు మోసపోతున్నది తన తెలంగాణ వాసులే. ఏటేటా ఈ సంఖ్య పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. ప్రభుత్వం, పోలీసులు, సైబర్ నిపుణులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. రోజూ మోసపోయే వారి సంఖ్య తగ్గడం లేదు కదా పెరుగుతోంది. మనిషి అత్యాశ, నిర్లక్ష్యరాస్యత రెండూ సైబర్ నేరస్థుల ఆయుధాలు. ఈ రెండింటితోనే రోజూ వారు కోట్లు కొట్టేస్తున్నారు. హైదరాబాద్​లో తెలుగుతో పాటు హిందీ మట్లాడే వారి సంఖ్య ఎక్కువ. ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. ఇక్కడకు ఉత్తరాది వారు ఎక్కువగా వచ్చేస్తుంటారు. పైగా మన దగ్గర నివాసించేందుకు అయ్యే ఖర్చు కూడా ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే చౌక. అందుకే బతుకు దెరువు కోసం వచ్చే అందరి గమ్యస్థానం హైదరాబాద్ అయింది. ఇదే సైబర్ నేరస్థులకు కూడా బాగా కలిసి వస్తోంది. ఈ సమస్య నుంచి రాష్ట్ర వాసులను బయట పడేయటం పోలీసులకు కత్తిమీద సాములాగానే మారింది. అసలు మనరాష్ట్రంలో ఈ స్థాయిలో సైబర్ నేరాల విస్తృతికి కారణం ఏమిటి?, ఎందుకు తెలంగాణనే సైబర్ నేరస్థుల టార్గెట్ అవుతోంది. కేవలం హిందీ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా ఓ కారణమా.. సైబరాసుల వల నుంచి మహిళలకు రక్షణ కల్పన ఎలా?, ఆన్‌లైన్‌లో వారు ఎదుర్కొనే సాధారణ నేరాలు ఏమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తుంటాయి. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పిచండం ఎలా... ఇప్పటివరకు జరుగుతున్న అవగాహన తీరు ఎలాంటి మార్పులు చేయాలి. అసలు డిజిటల్ వాతవరణం, లావాదేవీల్లో మనం చేస్తున్న పొరపాట్లేంటి?.. ఇలాంటి అంశాలపై సైబర్ నిపుణులతో ఈటీవీ ప్రతిధ్వని ప్రత్యేక చర్చ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో కొత్త రూపు దిద్దుకుంటున్న సైబర్ నేరాలు, మనం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details