ధరణి సమస్యలు తీరినట్లేనా?
Pratidwani: రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌లో కొత్త మాడ్యూళ్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎంతోకాలంగా ఉన్న ఫిర్యాదులు, ఆందోళనలను పరిశీలించి... వాటికి ఊరటగా మార్పులు చేస్తూ... ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అవసరమైన విధానాలు, అన్ని సాంకేతికాంశాలు దృష్టిలో పెట్టుకుని కొత్త మాడ్యూళ్లను తీసుకుని రానున్నారు. ధరణికి ముందు రిజిస్ట్రేషన్ పోర్టల్ కార్డ్ సాఫ్ట్‌వేర్‌లో జరిగిన అగ్రిమెంట్ సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ-ఏజీపీఏ, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ-ఎస్‌పీఏల స్టాంపు డ్యూటీని సవరించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు కొత్త మాడ్యూళ్లు అందుబాటులోకి రానున్నాయి. అసలు ధరణిలో ప్రధాన సమస్యలేమిటి.. వాటిని పరిష్కరించేందుకు గతంలో ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టింది.. పోర్టల్ లోపాలపై ప్రభుత్వం వేసిన కమిటీపై ఏమైనా చర్యలు తీసుకున్నారా.. అసలా రిపోర్టులో ఏముంది.. కొత్తగా తీసుకొచ్చే ఈ మార్పులతో రైతుల సమస్యలు తీరినట్లేనా.. ఇంకా తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయా? ఇదే అంశంపై ఈటీవీ ప్రతిధ్వనిలో నేడు నిపుణులతో చర్చించనుంది.