Pratidwani : ప్రభుత్వాసుపత్రులు... ప్రసవాలు
Pratidwani : మాతృత్వం స్త్రీలకు దేవుడిచ్చిన వరం. కానీ వరం అందుకోవాలంటే స్త్రీలు పునర్జన్మ ఎత్తినంత కష్టాలు దాటాలి. ఆ శ్రమ, ఆపదలు తగ్గించడంలో రాష్ట్రంలోని గర్భిణీలకు పెద్దదిక్కుగా మారుతున్నాయి... ప్రభుత్వ దవాఖానాలు. అదీ ఏ స్థాయిలో అంటే... ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్రవ్యాప్తంగా 69% ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే నమోదయ్యాయి. తెలంగాణ దేశంలోనే రికార్డు సృష్టించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత వైద్య రంగంలో ఎన్నో మార్పులు చేపట్టారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా నిధుల కేటాయింపులు పెరిగాయి. సిబ్బంది భర్తీ వేగంగా జరిగింది. వారికి వేతనాలు పెంచి జవాబుదారీతనం పెంచారు. అంతేకాకుండా మెరుగైన సౌకర్యాలు అందించిన వారికి ప్రత్యేక బోనస్ లు కూడా ప్రకటించడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కోసం పేదలే కాదు మధ్య తరగతి వారు క్యూ కట్టారు. మరి ఈ మార్పు ఎలా సాధ్యమైంది? 100% ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరిగేలా కొనసాగించడం, ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు మరింత నమ్మకం కలిగించే దిశగా ప్రభుత్వం ఇంకా అధిగమించాల్సిన సవాళ్లు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.