Pratidwani బీఆర్ఎస్ ఆవిర్భావ సందేశం - ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ
Pratidwani ఈ సభతో దేశంలో ప్రబల మార్పునకు నాంది ప్రస్తావన. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సందర్భంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్న మాట ఇది. అదే సమయంలో దేశం అంతా తెలంగాణ మోడల్‌తో అభివృద్ధి అన్నది చాలాకాలంగా బీఆర్ఎస్వర్గాలు చెబుతున్నమాట. మరి... జాతీయ రాజకీయాల్లో గులాబీదళం ఆశిస్తున్న ఫలితాలు ఏమిటి? టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా అవతరించినంత తేలికగా బీజేపీకి జాతీయస్థాయిలో ప్రత్యమ్నాయం కాగలరా? ఆ క్రమంలో బీఆర్ఎస్ అధిగమించాల్సన సవాళ్లు... సాధించాల్సిన సానుకూల ఫలితాలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.