తెలంగాణ

telangana

Pratidwani : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు? నవంబర్​లోనా.. ఏప్రిల్​లోనా..?

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2023, 9:24 PM IST

Pratidwani

Pratidwani discussion on Assembly Elections in Telangana : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు? ఇప్పుడు రాష్ట్ర రాజకీయవర్గాల్లో, సామాన్య ప్రజల్లో కూడా చక్కర్లు కొడుతున్న ప్రశ్న ఇదే. 2018 ఎన్నికల ప్రకారమే డిసెంబర్‌ నాటికే ముహూర్తం ఖాయం కావాలి. కానీ ఇటీవల మొదలైన జమిలీ ముచ్చట... కొద్దిరోజులుగా రాష్ట్రంలోని ముఖ్య రాజకీయ పార్టీల నాయకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలే అందుకు కారణం. నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ జమిలీ ఎన్నికలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఎన్నికలు నవంబర్​లో జరగడం లేదని.. ఏప్రిల్ లేదా మే లో జరిగే అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. మరి రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు  జరగబోతున్నాయి? ఎన్నికలకు ఎంతో వ్యవధి లేదని ఉరుకులు పరుగుల మీద ఏర్పాట్లు చేసుకుంటున్న రాజకీయపక్షాలపై ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.   

ABOUT THE AUTHOR

...view details