మరింత మెండుగా వ్యవసాయం - వ్యవసాయం
Published : Jan 17, 2024, 9:45 PM IST
Pratidwani : దేశంలో మరే రంగమూ లేనంతగా సమస్యలు ఎదుర్కొనేది... వ్యవసాయం. మార్కెట్లలో దళారీ వ్యవస్థ నుంచి గిట్టుబాటు ధరలు, విత్తనాలు ఎరువుల వరకు లెక్కకు మిక్కిలి సమస్యలు. సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న అన్నదాతల సమస్యకు పరిష్కారం ఏ సర్కార్ చూపలేక పోయింది. ప్రతి ఏటా ఏదో ఒక సమస్య. ఏరు వాక నుంచి ఈ సమస్యలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా కూడా ఫలితం కనిపించడం లేదు. పేరుకుపోయిన ఈ సమస్య ప్రతి ఏటా రైతులను నిండా ముంచుతూనే ఉంది. రాష్ట్రంలో ఈ ఇక్కట్లు తీర్చే దిశగా చర్యలు ఆరంభించింది రాష్ట్ర ప్రభుత్వం. మార్కెట్ యార్డుల్లో దళారీ వ్యవస్థ నిర్మూలించాలని, విత్తనాలు, ఎరువులను సకాలంలో అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. మరి రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అమలు చేసే క్రమంలో ఉన్న సవాళ్లు ఏమిటి. రాష్ట్ర వ్యవసాయ రంగం ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటోంది? వాటిని తీర్చడానికి ఏ ఏ మార్గాలు అనుసరిస్తే మేలు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.