Pratidwani: దేశంలో అంబేడ్కర్ ఆశయాలకు దక్కుతున్న మన్నన ఎంత? - Hyderabad Latest News
Pratidwani: ఏప్రిల్ 14 మహనీయుడు అంబేడ్కర్ జన్మించిన రోజు. యావత్ భారతావని గర్వించదగిన అంబేడ్కర్ పేరు స్మరించిన వారు ఉండరు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు అంబేడ్కర్‌కు ఘన నివాళులు అర్పించాయి. అంబేడ్కర్ విగ్రహాలు, పథకాలకు పేర్లు, భవనాలకు పేర్లు పెట్టడం ద్వారా అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్నామని చెబుతున్నాయి. అసలు ఈరోజు దేశంలో అంబేడ్కర్ ఆశయాలకు దక్కుతున్న మన్నన ఎంత? రాజకీయాల గురించి, చట్టసభల గురించి, రాజ్యాంగ విలువల గురించి, పౌరుల గురించి అంబేడ్కర్ ఏం చెప్పారు? దేశంలోని రాజకీయ పార్టీలు ఆ స్ఫూర్తి ఏ మేరకు అమలు చేస్తున్నాయి? అంబేడ్కర్ ఎలాంటి సమాజాన్ని ఆశించారు? ఆ దిశగా పయనిస్తున్నామా?సామాజిక, ఆర్థిక సమానత్వం లేకుండా రాజకీయసమానత్వం.. సాధించలేం అన్నది అంబేడ్కర్ చేసిన మరో ప్రధాన సూచన.ఇన్నేళ్లలో ఆ విషయంలో సాధించిన పురోగతి ఎంత? అంబేడ్కర్‌కు అందించాల్సిన నిజమైన నివాళి ఏమిటి? ఇంకా అంబేడ్కర్ నుంచి అలవరుచుకోవాల్సింది ఏంటి? రేపటితరం భవిష్యత్ కోసం అది ఎలాంటి బాటలు పరచాలి? ఇదే నేటి ప్రతిధ్వని.