తెలంగాణ

telangana

etv Pratidwani

ETV Bharat / videos

Prathidwani : రహదారి ప్రమాదాలు... నేర్వాల్సిన పాఠాలు.. - today prathidwani

By

Published : Jul 5, 2023, 10:34 PM IST

Prathidwani on Road Accidents : నిత్యం రక్తమోడుతున్న రాజధాని రహదార్లు ఆందోళన కలిగిస్తున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం.. ట్రాఫిక్‌ సమస్యలు వెరసి... ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. అసలు.. ఇంత ఆధునిక యుగంలోనూ రహదారి ప్రమాదాలు రోజురోజుకీ.. పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం, కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంతో పాటు ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. మైనర్లకు కార్లు, బైకులు ఇచ్చే తల్లిదండ్రులు తెలంగాణలో ఎక్కువే. లైసెన్స్ లేకుండా నడపొద్దని తెలిసినా ఎవరూ వినడం లేదు. పైగా ఖరీదైన బైకులు కొనిస్తున్నారు. వారు అతివేగంతో వెళ్తూ వారి ప్రాణాలు పోగొట్టుకోవడమే కాదు.. ఇతరుల ప్రాణాలు బలిగొంటున్నారు. నిన్న నార్సింగ్​ పరిధిలో జరిగిన ఘటన అలాంటిదే. ఇలాంటి ఘటనలకు మూల కారణాలు ఏమిటి? సాంకేతికత ఎందుకు ఉపయోగ పడడం లేదు? దేశంలో యుద్ధాల్లో మరణించే వారికన్నా రోడ్డు ప్రమాదాల్లో చని పోయేవారే ఎక్కువ. యువత పెద్దసంఖ్యలో ప్రమాదాల్లో బలవుతోంది. ఈ భయానక చిత్రాన్ని సరిదిద్దడానికి చేపట్టాల్సిన చర్యలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details